Animal Husbandry - CHITTOOR DISTRICT'S OFFICIAL WEBSITE | ANDHRA PRADESH | INDIA - చిత్తూరు జిల్లా అధికారిక వెబ్సైట్ - ChittoorDistrictWebsite

ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారిక వెబ్సైటు. ఈ వెబ్సైటు నందు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఏదేని సమాచారం పొందు పరచవలెనన్న అట్టి సమాచారాన్ని చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం నందలి కంప్యూటరు విభాగమునకు చేర్చవలెను. లేదా వారి అధికారిక మెయిల్ నుండి మెయిల్ చేయవలెను. మెయిల్ అడ్రస్ tgsreddy@gmail.com. మరింత సమాచారం కొరకు మొబైల్ నెంబరు 9849375731/ 9441976449 నకు ఫోన్ చేయండి.
Go to content

Main menu

Animal Husbandry

Government Schemes
Government Schemes - Animal Husbandry - ప్రభుత్వ పథకములు - పశుసంవర్ధక శాఖ


పశుసంవర్థక శాఖ


పశు క్రాంతి పథకము

  • యూనిట్ విలువ రూ.30,000

  • ప్రభుత్వ సబ్సిడీ:  50 శాతం

  • బ్యాంకు రుణం:  50 శాతం

  
అర్హతలు

  • లబ్దిదారుడు దారిద్ర్యరేఖకు దిగువ ఉండవలెను.

  • వయస్సు 18-55 సంవత్సరముల మధ్య కలిగి ఉండవలెను.

  • పాడిపశువుల పెంపకములో అనుభవము కలిగి  ఉండవలెను.

  • లబ్దిదారుల ఎంపికలో వికలాంగులకు/షెడ్యూల్డ్ తెగలకు/షెడ్యూల్డ్ కులాలకు ప్రాధాన్యత.


జీవక్రాంతి పథకము (పొట్టేళ్ళ పిల్లల పెంపకము)

  • యూనిట్ విలువ రూ.28,000

  • ప్రభుత్వ సబ్సిడీ:  50 శాతం

  • బ్యాంకు రుణం:  50 శాతం


గడ్డి విత్తనములు సరఫరా: చిన్న సన్నకారు రైతులకు

  • ప్రభుత్వ సబ్సిడీ: 75 శాతం


జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం

  • పాతర గడ్డి సైలో పిట్స్ ద్వారా తయారుచేయుట

  • యూనిట్ విలువ రూ.17,000

  • ప్రభుత్వ సబ్సిడీ పూర్తి రాయితీ

  • ఉపాధి హామీ కార్డు కలిగి ఉండవలెను.


అర్హతలు

  • పనిదినములు 100 రోజులు మించి ఉండరాదు.

  • కనీసం 20 రోజులు పనిచేసి ఉండవలెను.

  • షె.కు/షె.తె అయితే 10 రోజులు పనిచేసి ఉండవలెను.


రాష్ట్రీయ కృషి వికాస్ యోజన : (మిని డైరీలు, యూనిట్లు)

  • యూనిట్ విలువ రూ.1,75,000

  • ప్రభుత్వ రాయితీ : 25 శాతము

  • రుణం తిరిగి చెల్లించు వ్వవధి : బ్యాంకు నిబంధనల మేరకు

  • గ్రామీణ యువతకు ప్రాధాన్యత

  • పశుగ్రాస పెంపకమునకు సరిపడు భూమి కలిగి ఉండవలెను

  • వయోపరిమితి 18-55 సంవత్సరముల మధ్య  కలిగి ఉండాలి

  • పాడి పశువుల పెంపకమునకు అనుభవము కలిగి ఉండవలెను


పాడి పశువుల భీమా పథకము

  • 2  పాడి పశువులకు మాత్రం వర్తించబడును

  • కనీసం రోజుకు 5 లీటర్ల పాలు ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండవలెను

  • ప్రీమియం 1 సంవత్సరానికి 2.75 శాతం

  • 3 సంవత్సరములకు 7 శాతం ప్రీమియం

  • ప్రభుత్వ రాయితీ : 50 శాతం


ఇతర వివరములకు సంప్రదించవలసిన అధికారుల చిరునామా


సంబందిత మండల పరిషత్ అభివృధ్డి అధికారి /
సంయుక్త సంచాలకులు, పశు సంవర్థక శాఖ,
పి.వి.కె.యన్. కళాశాల వెనుక,
చిత్తూరు -517 002
ఫోన్ నెం.08572 - 241800

ప్రింట్


Back to content | Back to main menu