పౌర సామాగ్రి
పాత్ర మరియు డిపార్ట్మెంట్ యొక్క పనితనం:
సివిల్ సర్వీసెస్ డిపార్టుమెంటు నిజానికి ఒక రెగ్యులేటరీ డిపార్ట్మెంట్. తదనుగుణంగా, దాని కార్యకలాపాలు క్లస్టర్ మిల్లింగ్ వరి కోసం పి. పి. సి ల ద్వారా వరిని కొనుగోలు చేయటానికి విస్తృతమైనది, అవసరమైన వస్తువుల పంపిణీ అంటే. బిపిఎల్ రేషన్ కార్డులను (అంటే వైట్, ఎ.ఎ.వై మరియు అన్నపూర్ణ), కన్స్యూమర్ ఎఫైర్స్, పర్యవేక్షణ ఉన్న ఈ – పోస్ కం ఎలక్ట్రానిక్ బరువు యంత్రాలు ద్వారా సబ్సిడీ రేట్లుతో ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు, పంచదార, కందిపప్పు అను నిత్యావసర సరకులను జిల్లాలోని 11,33,540 కార్డుదారులకు 2,900 చౌక ధర దుకాణాల ద్వారా ప్రతి నెల 1వ తేది నుంచి 15వ తేది వరకు పంపిణి చేయబడుచున్నది.
పథకాలు / చర్యలు / చర్యల ప్రణాళిక:
- ప్రజా పంపిణి వ్యవస్థ : – బిపిఎల్ వైట్ కార్డు దారులకు కుటుంబలో ప్రతి ఒకొక్క సభుల్యకు 5 కిలోల చొప్పున బియ్యం కిలో
ఒక్క రూపాయికి మాత్రమే పంపిణి చేయబడుచున్నది.
- అంత్యోదయ అన్నా యోజన పథకం: కిలో ఒక రూపాయ చొప్పున 35 కిలోల బియ్యం పంపిణి చేయబడుచున్నది.
- అన్నపూర్ణ స్కీమ్: – అన్నపూర్ణ కార్డుదారులకు ఉచితంగా కార్డుకు 10 కిలోల బియ్యం పంపిణి చేయబడుచున్నది.
- మిడ్ డే మీల్స్ / ఐసిడిఎస్ పథకం: – మధ్యాహ్న భోజన పథకం మరియు పంపిణీకి బియ్యం, పామాయిల్ మరియు కందిపప్పు అంగన్వాడీ కేంద్రాలకు చౌక ధర దుకాణాల ద్వారా రాయితీ రేట్లుతో పంపిణి చేయబడుచున్నది.
- సంక్షేమం హాస్టల్స్ : – రాయితీ రేట్లుతో బి సి హాస్టల్స్ / ఎస్ సి హాస్టల్స్ / ఎస్ టి హాస్టల్స్ బియ్యం పంపిణి చేయబడుచున్నది
- జైళ్లు: – ప్రభుత్వం రైస్ పంపిణీ. కేంద్ర జైలులు మరియు ఇతర జైలుల కు రాయితీ రేట్లుతో పంపిణి చేయబడుచున్నది.
ధాన్యం సేకరణ 2018-19:
జిల్లాలోని రైతులు పండించిన వరిధాన్యమును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిoచిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయుటకు 2018-19 ఖరీఫ్ మరియు రభీ సీజన్లో 26 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 47112 మెట్రిక్ టన్నులు వరిధాన్యమును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడమైనది. ఈ విధంగా కొనుగోలు చేసిన ధాన్యమును కొనుగోలు కేంద్రాల నుంచి నేరుగా సమీపంలోని రైసు మిల్లులకు డెలివరీ చేయిoచి మర అడించి 67 శాతం బియ్యంను పౌరసరఫరాల సంస్థకు యివ్వడమైనది. దీనివలన జిల్లాలో సుమారు 2210 రైతులు వారు పండించిన వరిధాన్యమును కనీస మద్దతు ధరను పొందడమైనది. రైతులు సుమారుగా 73 కోట్లు చెల్లించి 28974 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా జిల్లాలోని బి.పి.ఎల్ కార్డుదారులకు సబ్సిడీ ధరకు పంపిణి చేయడం జరుగుచున్నది.